Punjab: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం భగవంత్‌ మాన్‌

పంజాబ్‌ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో (Confidence Motion) భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం విజయం సాధించింది.

Published : 03 Oct 2022 19:38 IST

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో (Confidence Motion) భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం విజయం సాధించింది. సీఎం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై నేడు జరిగిన ఓటింగ్‌కు కాంగ్రెస్, భాజపాలు దూరంగా ఉన్నాయి. ఎస్‌ఏడీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండడంతో ఈ ఓటింగ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీకి ఫుల్‌ మెజారిటీ లభించినట్లయ్యింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం భగవంత్‌ మాన్‌.. ‘ఆపరేషన్‌ లోటస్‌’ (Operation Lotus) పేరుతో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.

తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలతో సీఎం మాన్‌ గతవారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌ సంద్వాన్‌ ఓటింగ్‌ చేపట్టారు. సీఎంకు మద్దతుగా ఉన్నవారిని చేయి ఎత్తమని కోరడంతో ఆప్‌ ఎమ్మెల్యేలంతా మద్దతు పలికారు. విశ్వాస పరీక్షపై ఎస్‌ఏడీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండగా..  కాంగ్రెస్‌, భాజపా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఆప్‌ ప్రభుత్వం విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని