Pegausus: ‘పెగాసస్‌’తో దద్దరిల్లిన పార్లమెంట్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ‘పెగాసస్‌’ వ్యవహారం కుదిపేస్తోంది.  హ్యాకింగ్‌పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఆందోళనలకు దిగాయి. దీంతో కొద్ది నిమిషాలకే

Published : 20 Jul 2021 11:28 IST

ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదా పడిన ఉభయసభలు

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ‘పెగాసస్‌’ వ్యవహారం కుదిపేస్తోంది.  హ్యాకింగ్‌పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఆందోళనలకు దిగాయి. దీంతో కొద్ది నిమిషాలకే ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. 

ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్షాలు ‘పెగాసస్‌’ అంశాన్ని లేవనెత్తాయి. హ్యాకింగ్‌ వ్యవహారంపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. విపక్ష ఎంపీలు సీట్ల నుంచి బయటకు వచ్చి నినాదాలు చేశారు. సభను కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్‌ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరారు. అయిన్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో నాలుగు నిమిషాలకే సభ వాయిదా పడింది. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. ఆందోళనల నడుమే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రశ్నోత్తరాల గంటలను ప్రారంభించారు. అయితే దాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని