Semiconductor: దేశంలో సెమీకండక్టర్‌ చిప్‌ల రూపకల్పన ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం

దేశంలో సెమీ కండక్టర్‌ చిప్‌ల రూపకల్పన, తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Published : 15 Dec 2021 23:46 IST

దిల్లీ: దేశంలో సెమీ కండక్టర్‌ చిప్‌ల రూపకల్పన, తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్‌ రూ.76వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. దీనికి ‘డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ సెమీకండక్టర్స్‌ అండ్‌ డిస్‌ప్లే మాన్యుఫ్యాక్చరింగ్‌ ఎకో సిస్టమ్‌’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఆరేళ్ల కాల వ్యవధిలో మొత్తం నిధులు ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వివిధ రంగాలపై కీలక ప్రభావం చూపుతుందని, అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి ఏకీకరణకు దోహదపడుతుందని అన్నారు. 2025 నాటికి యునైటెడ్‌ స్టేట్స్ డాలర్స్ (యూఎస్‌డీ)లో ఐదు ట్రిలియన్‌ డాలర్‌ల ఆర్థిక వ్యవస్థకు, 5 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీసాధించడంలోనూ గణనీయంగా దోహదం చేస్తుందన్నారు. అంతేకాకుండా యూపీఐ, రూపే డెబిట్‌ కార్డులను ఉపయోగించి జరిపే డిజిటల్‌ లావాదేవీలపై కేంద్రం రూ.1,300కోట్ల రీఎంబర్స్‌మెంట్‌కు కూడా కేంద్రం ఆమోద ముద్రవేసిందని ఠాకూర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని