Deve Gowda: చరిత్రలో అలా నిలిచిపోవాలన్నదే నా కోరిక: మాజీ ప్రధాని దేవెగౌడ

తన ప్రాంత ప్రజల నీటి హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే తన కోరిక అని మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ అన్నారు.

Published : 18 Oct 2023 01:43 IST

బెంగళూరు: తన ప్రాంత ప్రజల నీటి హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే తన కోరిక అని మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. 60ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని.. కేవలం రాజకీయాల కోసం కొనసాగలేదన్నారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్న సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రతిక్షణం తాను ప్రజల కోసమే కష్టపడ్డానన్నారు.

‘మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా.. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి ఉన్నత ఆలోచనలతోనే పని చేయడానికి ప్రయత్నించాను. ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదు. నేను కాలం చేసిన తర్వాత కూడా.. ఈ ప్రాంత ప్రజల నీటి హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా నన్ను గుర్తుపెట్టుకోవాలన్నదే నా కోరిక’ అని జనతాదళ్‌ (ఎస్‌) అధినేత దేవెగౌడ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశం నాటి సంగతులను గుర్తు చేసుకున్న ఆయన.. అభివృద్ధికి సంబంధించి ఉన్నత ఆలోచనలే తనకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేవన్నారు.

‘మహువా’పై ఆరోపణల వ్యవహారం.. లోక్‌సభ నైతిక విలువల కమిటీకి సిఫార్సు

‘రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఓ లక్ష్యం పెట్టుకున్నా. పాత మైసూరు ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం కావేరి జలాలను వినియోగించాలని సంకల్పించా. మద్రాస్‌, మైసూర్‌ల మధ్య రెండు శతాబ్దాలుగా ఉన్న నీటి వివాదాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించా. అలా ఇక్కడి ప్రజల నీటి హక్కుల కోసమే అనుక్షణం పోరాటం చేశా. అదే నన్ను రాజకీయాల్లో నిలదొక్కుకొనేలా చేసింది. నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. అదే నా వారసత్వంగా మారాలని ఆశిస్తున్నా’ అని దేవెగౌడ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు