Borewell: 70 అడుగుల లోతు బోరులో ఇరుక్కుపోయిన కార్మికుడు..!

రహదారి (Highway) నిర్మాణంలో భాగంగా తొవ్విన భారీ బోరు లోపల (Borewell) ఓ కార్మికుడు ఇరుక్కుపోవడంతో.. అతడిని రక్షించేందుకు ఆపరేషన్‌ చేపట్టారు.

Published : 13 Aug 2023 14:10 IST

చండీగఢ్‌: రహదారి (Highway) నిర్మాణంలో భాగంగా తొవ్విన భారీ బోరు లోపల (Borewell) ఓ కార్మికుడు ఇరుక్కుపోయిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఓ కార్మికుడు ప్రాణాలతో బయటపడగా.. మరో వ్యక్తి అందులోనే చిక్కుకుపోయాడు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. అతడిని రక్షించేందుకు ఆపరేషన్‌ చేపట్టాయి.

ఒక్కసారి గాల్లోకి ఎగిరితే.. చైనా, పాక్‌ సరిహద్దులను చుట్టేస్తుంది..!

దిల్లీ నుంచి జమ్మూలోని కట్‌రా వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే (Delhi-Katra Expressway) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పంజాబ్‌ జలంధర్‌లోని కర్తార్‌పుర్‌ సమీపంలో భారీ పిల్లర్‌ను ఏర్పాటు చేసేందుకు పెద్ద గొయ్యి తొవ్వారు. ఇందుకోసం ఓ భారీ గుంత వేశారు. ఆ క్రమంలో లోపల బోరింగ్‌ యంత్రంలో సమస్య తలెత్తడంతో ఇద్దరు కార్మికులు అందులోకి దిగారు. అనంతరం ఓ కార్మికుడు పైకి రాగా.. సురేశ్‌ అనే వ్యక్తి మాత్రం 70 అడుగుల లోతులోనే చిక్కుకుపోయాడు. అతడిపై ఇసుక పడటంతో బయటకు రాలేకపోయినట్లు సమాచారం. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేయడంతో.. వారితోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని