12th Fail: ‘12th ఫెయిల్‌’ హవా.. ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డు..

‘12th ఫెయిల్‌’ మరో అరుదైన ఘనత సాధించింది.

Updated : 09 Feb 2024 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్‌’(12th Fail). చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకొని రికార్డులు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) తాజాగా ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 250 ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఈ సినిమా 50వ స్థానంలో నిలిచింది. అంతేకాదు.. టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్‌ సినిమా కూడా ఇదే. దీనిపై దర్శకుడు (Vidhu Vinod Chopra) స్పందిస్తూ.. ‘ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా చనిపోయినా ఫర్వాలేదనిపిస్తోంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఐఎమ్‌డీబీలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా ఈ చిత్రం గతంలోనే రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ చిత్రాలను వెనక్కినెట్టి 9.2 రేటింగ్‌తో ‘12th ఫెయిల్‌’ సంచలనం సృష్టించింది.

మేకప్‌ తీసేసి రమ్మంటే.. మణిరత్నం జోక్‌ చేస్తున్నారనుకున్నా: ప్రీతీ జింటా ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా విషయానికొస్తే.. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు.. ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు పోటీపడనుంది. జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా చిత్రబృందం నామినేషన్‌ వేసింది.

యువ నటుల్లో స్ఫూర్తి నింపారు: బొమన్‌ ఇరానీ

ఈ చిత్రంపై తాజాగా బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ (Boman Irani) ప్రశంసలు కురిపించారు. తనకెంతో నచ్చిందని పేర్కొన్నారు. విక్రాంత్‌ మస్సే అద్భుతంగా నటించారని.. పాత్రకు జీవం పోశారన్నారు. ఈ చిత్రం ఎంతోమంది యువ నటుల్లో స్ఫూర్తి నింపిందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని