12th Fail: మరోసారి ‘12th ఫెయిల్‌’ హవా.. రెండు క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులు..

దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘12th ఫెయిల్‌’ చిత్రం మరో రెండు అవార్డులను సొంతం చేసుకుంది.

Published : 13 Mar 2024 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్‌’(12th Fail). చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు అవార్డులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ 2024లో తన హవా కొనసాగించింది.

ప్రతి ఏడాది ఘనంగా జరిగే క్రిటిక్స్‌ ఛాయిస్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈసారి మార్చి 12న ముంబయిలో నిర్వహించారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు రిచా చద్దా, కరణ్‌ జోహార్‌, అనిల్ కపూర్‌, విద్యాబాలన్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇందులో ‘12th ఫెయిల్‌’ ఏకంగా రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్‌’ నిలవగా.. ఉత్తమ నటుడిగా విక్రాంత్‌ మస్సే అవార్డును అందుకున్నారు. దీనిపై చిత్రబృందం ఆనందం వ్యక్తంచేసింది. ఈసందర్భంగా అనిల్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ‘విధు వినోద్‌ చోప్రాకు నేను అవార్డు అందించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఎంతో సంతోషంగా ఉంది. 40 సంవత్సరాలుగా ఆయన్ని చూస్తున్నా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. సినిమాలంటే ఆయనకు పిచ్చి. రానున్న సంవత్సరాల్లో ఆయన ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ

మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ‘12th ఫెయిల్‌’ రూపొందింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు.. ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని