రూ.5వేల కోట్ల మోసం:  ‘స్కామ్‌ 1992’

స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో జరిగిన భారీ మోసం 1992 స్కామ్‌. స్టాక్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా ఇందులో కీలక సూత్రధారి. అతడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న

Updated : 02 Oct 2020 11:18 IST

ముంబయి: స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో జరిగిన భారీ మోసం 1992 స్కామ్‌. స్టాక్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా ఇందులో కీలక సూత్రధారి. అతడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్ ‌‘స్కామ్‌ 1992: ది హర్షద్‌ మెహతా స్టోరీ’. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. స్టాక్‌ మార్కెట్లు, బ్యాంకుల కార్యాకలాపాల్లోని లొసుగులు పసిగట్టిన హర్షద్‌ మెహతా రూ.5వేల కోట్ల మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

తాజా చిత్రంలో హర్షద్‌ మెహతాగా ప్రతీక్‌ గాంధీ నటిస్తున్నారు. ‘ది స్కామ్‌ బై దెబషిష్‌ బసు అండ్‌ సుచేత దలాల్‌’ పుస్తకం ఆధారంగా హన్సల్‌ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 9 నుంచి సోనీ లివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఆ ట్రైలర్‌ను మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని