Aadavaallu Meeku Joharlu: ఆ ఓటీటీలోకి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. ఎప్పుడంటే?

శర్వానంద్‌, రష్మిక జంటగా కిశోర్‌ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. థియేటర్ల వేదికగా మార్చి 4న విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

Updated : 01 Apr 2022 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌, రష్మిక జంటగా కిశోర్‌ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సీనియర్‌ తారలు రాధికా శరత్‌కుమార్‌, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. థియేటర్ల వేదికగా మార్చి 4న విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ద్వారా అలరించేందుకు సిద్ధంగా ఉంది. ‘సోనీలివ్‌’లో ఏప్రిల్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సోషల్‌ మీడియా వేదికగా ఈ వివరాల్ని ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేసింది సోనీలివ్‌.

క‌థేంటంటే: ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఒకే ఒక్క అబ్బాయి చిరంజీవి (శ‌ర్వానంద్‌). త‌నంటే ఇంటిల్లిపాదికీ గారాబం. చిరుకి పెళ్లి చేయాల‌ని కుటుంబ స‌భ్యులు సంక‌ల్పిస్తారు. అతడికి న‌చ్చినా.. ఇంట్లో ఆడ‌వాళ్లకి మాత్రం ఓ ప‌ట్టాన అమ్మాయిలు న‌చ్చరు. అలా బోలెడ‌న్ని సంబంధాల్ని తిర‌స్కరిస్తారు. పెళ్లి ప్రయ‌త్నాల్లోనే ఉన్న చిరు జీవితంలోకి అనుకోకుండా ఆద్య (ర‌ష్మిక‌) ప్రవేశిస్తుంది. ఆ ఇద్దరూ ద‌గ్గర‌వుతారు. చిరు కుటుంబ స‌భ్యుల‌కీ న‌చ్చడంతో ఆద్యనే త‌మ ఇంటి కోడ‌లిగా తీసుకు రావాల‌నుకుంటారు. కానీ ఆద్యకి పెళ్లి చేయ‌డం వాళ్లమ్మ, వ్యాపార‌వేత్త అయిన వ‌కుళ (ఖుష్బూ)కి ఇష్టం ఉండ‌దు. కార‌ణం త‌న జీవితంలో చోటు చేసుకున్న ప‌రిణామాలే. ఆద్యనేమో త‌ల్లి మాట జ‌వ దాట‌ని కూతురు. మ‌రి ఈ ప‌రిస్థితుల మ‌ధ్య చిరు- ఆద్యల పెళ్లి ఎలా జ‌రిగింద‌న్నదే మిగ‌తా క‌థ‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు