‘ఆచార్య’.. బిగ్‌ అనౌన్స్‌మెంట్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రబృందం నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 29న సాయంత్రం విడుదల..

Updated : 29 Jan 2021 12:23 IST

టీజర్‌ విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రబృందం నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 29న సాయంత్రం విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఈ మేరకు టీజర్‌ విడుదల తేదీని తెలియజేస్తూ బుధవారం ఓ సరికొత్త వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

‘డియర్‌ చిరు సర్‌.. ధర్మస్థలి తలుపులు జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు తెరుచుకోనున్నాయి.’ - కొరటాల శివ

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన కాజల్‌ కథానాయికగా సందడి చేయనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ సిద్ధగా కీలకపాత్రను పోషిస్తున్నారు. చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన... ‘ఆచార్య’ పోస్టర్‌‌, భారీ ఆలయం సెట్‌, ఇటీవల విడుదల చేసిన సిద్ధ బ్యాక్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

ఆ మాటతో నాకెంతో భయమేసింది: ప్రదీప్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు