Arundhathi Nair: ప్రమాదంలో హీరోయిన్‌కు తీవ్ర గాయాలు.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు

మలయాళ హీరోయిన్‌ అరుంధతీ నాయర్‌ తీవ్ర గాయాల పాలయ్యారు.

Published : 18 Mar 2024 22:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హీరోయిన్‌ అరుంధతీ నాయర్‌ (Arundhathi Nair) రోడ్డు ప్రమాదానికి గురయ్యారని కోలీవుడ్‌లో వచ్చిన వార్తలపై ఆమె సోదరి ఆర్తి నాయర్‌ స్పందించారు. ఆ న్యూస్‌ నిజమేనని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు. మూడో రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని, తిరువనంతపురంలోని అనంతపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉన్నట్లు చెప్పారు. మరోవైపు, అరుంధతీ నాయర్‌ స్నేహితురాలు, నటి గోపికా అనిల్‌ సైతం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. చికిత్సకు చాలా ఖర్చవుతుందని, అంత డబ్బు తమ వద్ద లేదని, ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయం చేసి అరుంధతి కుటుంబానికి అండగా నిలవాలని గోపిక విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఖాతా వివరాలను జోడించారు.

తమిళ చిత్రం ‘పొంగి ఎజు మనోహర’తో తెరంగేట్రం చేశారు అరుంధతి. తర్వాత, విజయ్‌ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ‘సైతాన్‌’లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘డోంట్‌ థింక్‌’, ‘పద్మిని’వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ ఆమె కీలక పాత్రల్లో నటించారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తన సోదరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని