Bichagadu 2: ‘బిచ్చగాడు’ సినిమాకి మహేశ్‌బాబు సెట్ అవుతారు: విజయ్ ఆంటోనీ
తాను నటించిన ‘బిచ్చగాడు’ సిరీస్ చిత్రాలు అగ్ర హీరో మహేశ్‌బాబు సెట్ అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు 2’ మే 19న విడుదలకానున్న సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: స్వీయ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా నటించిన చిత్రం.. ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2). మే 19న ఈ సినిమా విడుదలకాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, మీమర్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘ఒకవేళ బిచ్చగాడు సిరీస్ చిత్రాల్లో మీరు నటించకపోయి ఉంటే.. మీ స్థానంలో ఏ హీరో అయితే బాగుంటారని భావిస్తున్నారు?’ అని ఒకరు అడగ్గా ఆయన మహేశ్‌బాబు (Mahesh Babu) పేరుని ప్రస్తావించారు. ‘బిచ్చగాడు’ పాత్ర హావభావాలను మహేశ్ అద్భుతంగా పలికించగలరని అభిప్రాయపడ్డారు. తమిళ్‌లో అయితే ఆ చిత్రానికి విజయ్‌గానీ అజిత్‌గానీ సూట్ అవుతారని చెప్పారు. ఈసారి నేరుగా తెలుగులో సినిమా చేయబోతున్నానని, సంబంధిత వివరాలు త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. తాను నటించిన ఐదు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయన్నారు.
‘బిచ్చగాడు 2’ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా కథకు, 2016లో విడుదలైన ‘బిచ్చగాడు’ కథకు సంబంధం ఉండదని, హీరో పాత్ర బిచ్చగాడు కావడంతో కొత్త సినిమాకి ‘బిచ్చగాడు 2’ పెట్టామని తెలిపారు. వ్యక్తిగతంగా తాను సెన్సిటివ్ అని, అందుకే సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉన్న కథలు రాస్తుంటానని అన్నారు. దర్శకుడి కోణం నుంచి చూస్తే తాను గొప్ప నటుణ్ని కాదని పేర్కొన్నారు. సినిమాకు సంబంధించిన 24 విభాగాల్లో ఎడిటింగ్ చాలా కష్టమైందని, అదే ప్రధానమైందని పేర్కొన్నారు. మీమర్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. సినిమా ప్రమోషన్స్ చేసే విధానాన్నే వారు మార్చారని, సినిమాకి మించిన వినోదాన్ని పంచుతున్నారని ప్రశంసించారు. సమాచారాన్ని అందిస్తున్నారని కొనియాడారు. సోషల్ మీడియా లేకపోయి ఉంటే తన జీవితం బోరింగ్‌గా ఉండేదన్నారు.
తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘బిచ్చగాడు’ ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ‘బిచ్చగాడు 2’.. దానికి సీక్వెల్ కాదని స్పష్టం చేసిన విజయ్ ఆంటోనీ ఇందులో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమాలో హీరో విజయ్ గురుమూర్తి పాత్రలో.. భారత్‌లో 7వ అత్యంత సంపన్నుడిగా కనిపించారు. విజయ్ సరసన హీరోయిన్ కావ్యా థాపర్ నటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
YS Avinash Reddy: అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్
-
Politics News
Rahul Gandhi: దేవుడికే పాఠాలు చెప్పే ఘనుడు మోదీ.. అమెరికాలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
-
India News
45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించకపోతే..: అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరిక
-
Sports News
IPL Finals: ఆఖరి బంతికి అద్భుతం.. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఫైనల్స్ ఇవే!
-
World News
North Korea: కిమ్‌కు ఎదురుదెబ్బ.. విఫలమైన నిఘా ఉపగ్రహ ప్రయోగం..!
-
General News
Tirupati: తిరుపతి జూలో పెద్దపులి పిల్ల మృతి