Vishal: రూ. 6.5 లక్షలిచ్చా.. సెన్సార్‌ బోర్డులోనూ అవినీతి.. ఆరోపించిన విశాల్‌

తన కొత్త సినిమా సెన్సార్‌ పనులు పూర్తి చేసేందుకుగాను సంబంధిత అధికారులు డబ్బులు అడిగారంటూ నటుడు విశాల్‌ ఆరోపించారు.

Published : 28 Sep 2023 19:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలకు సెన్సార్‌ ఇచ్చే సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (Central Board of Film Certification) కార్యాలయంలోనూ అవినీతి పేరుకుపోయిందని నటుడు విశాల్‌ (Vishal) ఆరోపించారు. తన కొత్త చిత్రం ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony) విషయంలో తనకు ఎదురైన సమస్య గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

రివ్యూ: చంద్రముఖి-2here

‘‘అవినీతి గురించి తెరపై చూడడం ఓకేగానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా ఉంది. ముంబయి సెన్సార్‌ ఆఫీస్‌లోనూ ఇది జరుగుతోంది. నా ‘మార్క్‌ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ పనులు పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులకు రూ. 6.5 లక్షలిచ్చా (స్క్రీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం రూ. 3 లక్షలు). నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మరో దారిలేక డబ్బులివ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతకూ ఇలా జరగకూడదు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఈ విధంగా పోయే అవకాశమే లేదు! న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ మేరకు ఆ ఇద్దరి ‘ఎక్స్‌’ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. ఎవరెవరికి డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలనూ పోస్ట్‌లో పెట్టారు. 

విశాల్‌, ఎస్‌.జె. సూర్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన చిత్రమిది. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఈ నెల 15న విడుదలైంది. హిందీలో ఈ రోజు (గురువారం) విడుదలైంది. దీనికి సంబంధించి సెన్సార్‌ చేయించే క్రమంలోనే అధికారులు లంచం తీసుకున్నారని విశాల్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు