నానికి తెలియకుండా వీడియో షేర్‌ చేసిన శేష్‌.. ట్విటర్‌ వేదికగా నేచురల్‌ స్టార్‌ ప్రశ్న

అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ 2’. డిసెంబర్‌ 2న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ షురూ చేసింది.

Published : 13 Nov 2022 10:29 IST

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నానికి (Nani) తెలియకుండా ఆయన కార్యాలయంలో షూట్‌ చేసిన ఓ వీడియోను అడివి శేష్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. దీనిని చూసిన నాని.. ‘ఇలా కూడా చేస్తారా?’ అంటూ ట్విటర్‌ వేదికగా శేష్‌ని ప్రశ్నించాడు. ఇంతకీ ఆ వీడియో ఏమిటి?

నాని ప్రారంభించిన ‘వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌’ బ్యానర్‌పై తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ -2’. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ కార్యాలయానికి చేరుకున్న శేష్‌-మీనాక్షి ‘ఉరికే’ పాటకు డ్యాన్స్‌ చేశారు. ‘‘అవును.. నేను ‘ఉరికే ఉరికే’ పాటకు డ్యాన్స్‌ చేశా. ఇలా డ్యాన్స్‌ చేయడం కాస్త సిగ్గుగానే ఉంది. అయినా మీకోసం ఏదైనా చేస్తా’’ అంటూ శేష్ వీడియో షేర్‌ చేశాడు. దీనిపై నాని స్పందిస్తూ.. ‘‘నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడొచ్చా?’’ అని ప్రశ్నించాడు. 

రెండేళ్ల క్రితం వచ్చిన ‘హిట్‌’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. శైలేశ్‌ కొలను దర్శకుడు. అడివి శేష్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. ఇటీవల ఈ సినిమా నుంచి.. ‘ఉరికే ఉరికే’ అనే రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. దీంతో ఈ పాటను పలువురు ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌లో రీక్రియేట్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే శేష్‌ - మీనాక్షి సైతం ఈ పాటకు డ్యాన్స్‌ చేసి వీడియో షేర్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని