Aishwarya Rai: ఒక్క వీడియోతో రూమర్స్‌కు చెక్‌ పెట్టిన బచ్చన్ ఫ్యామిలీ!

అభిషేక్‌ బచ్చన్- ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai Bachchan) విడిపోతున్నారంటూ ఇటీవల కొన్ని వార్తలు వైరల్‌గా మారాయి. వాటికి ఒక్క వీడియోతో చెక్‌ పడింది.

Updated : 16 Dec 2023 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లోని క్యూట్‌ జంటల్లో అభిషేక్‌-ఐశ్వర్యా రాయ్‌ జోడీ ఒకటి. గత కొన్నిరోజులుగా ఈ జంటకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వీళ్లిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని.. ఇప్పటికే ఐశ్వర్యారాయ్‌ ముంబయిలోని బిగ్‌బీ ఇంటి నుంచి వచ్చేసినట్లు రకరకాల వార్తలు బాలీవుడ్‌ మీడియాలో వచ్చాయి. అయితే, తాజాగా వీటన్నింటికీ ఒక్క వీడియోతో బచ్చన్‌ ఫ్యామిలీ చెక్‌ పెట్టింది. ముంబయిలోని అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్ వార్షిక వేడుకలో అమితాబ్‌, అభిషేక్‌, ఐశ్వర్యలు కలిసి కనిపించారు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్‌ పడినట్లైంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఐశ్వర్యపై అభిషేక్‌ (Abhishek Bachchan)చేయి వేసి సరదాగా మాట్లాడుతూ లోపలికి వెళ్లారు. ఇక ఈ ఈవెంట్‌లోనే బచ్చన్‌ ఫ్యామిలీ అంతా సరదాగా డ్యాన్స్‌ కూడా చేసింది.

ప్రభాస్‌ను డార్లింగ్‌ అని ఎందుకంటారో అప్పుడర్థమైంది: పృథ్వీరాజ్‌

అసలు ఈ రూమర్‌ ఎక్కడ మొదలైందంటే ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌ ‘అంతా అయిపోయింది’ అని అర్థం వచ్చేలా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ రూమర్స్‌ మొదలయ్యాయి. ఐశ్వర్యారాయ్‌ సోషల్ మీడియాను అమితాబ్‌ అన్‌ఫాలో చేశారని కూడా బాలీవుడ్‌ మీడియా పేర్కొనడంతో వాటికి బలం చేకూరింది. వాటన్నింటికీ తాజా వీడియోతో చెక్‌ పడినట్లైంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని