Sunny Deol: సన్నీ దేఓల్‌ అప్పును అక్షయ్‌ తీర్చనున్నారా..?

సన్నీ దేఓల్‌ (Sunny Deol) అప్పును అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) తీర్చనున్నారంటూ సోమవారం ఉదయం కథనాలు వెలువడ్డాయి. వీటిపై అక్షయ్‌ టీమ్‌ స్పందించింది.

Updated : 21 Aug 2023 16:54 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సన్నీదేఓల్‌ (Sunny Deol) రుణాన్ని మరో బీటౌన్‌ హీరో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) తీర్చనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో జోరందుకున్న ఈ ప్రచారంపై తాజాగా అక్షయ్‌ టీమ్‌ స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

లోన్‌ తిరిగి చెల్లించని కారణంగా ముంబయిలోని సన్నీకి చెందిన ఓ విల్లాను వేలం వేయనున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆదివారం ఒక  ప్రకటన విడుదల చేసింది. తన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీతోపాటు జుహూలో ఉన్న సన్నీ(Sunny Deol) విల్లాను గ్యారంటీగా చూపించి ఆయన ఈ రుణాన్ని పొందారని.. దాదాపు రూ.56 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే లోన్‌ రికవరీలో భాగంగా సన్నీ విల్లాను వేలం వేయనున్నట్లు మీడియాలో వెల్లడైంది. సెప్టెంబర్‌ 25న ఈ వేలం జరగనుందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇవి బీటౌన్‌లో చర్చకు దారి తీశాయి. సాంకేతిక సమస్యలను కారణంగా చూపి, వేలానికి సంబంధించిన నోటీసును సోమవారం బ్యాంక్‌ వెనక్కి తీసుకుంది.

ఆగస్టు నెల.. ఆఖరి వారం.. అలరించే చిత్రాలు!

ఇదిలా ఉండగా.. సన్నీకి సాయం చేయాలనే ఉద్దేశంతో అక్షయ్‌ రంగంలోకి దిగారని నేటి ఉదయం కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరిందని.. ఈ మేరకు సదరు బ్యాంక్‌కు సన్నీ చెల్లించాల్సిన మొత్తాన్ని అక్షయ్‌ చెల్లించనున్నారని ఆ కథనాల్లోని సారాంశం. ఆ తర్వాత అక్షయ్‌ చెల్లించిన మొత్తాన్ని నిర్ణీత గడువులో సన్నీ ఆయనకు తిరిగి ఇవ్వనున్నారని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ వార్తలు అక్షయ్‌ టీమ్‌కు చేరాయి. దాంతో ఈ కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని