Alia bhatt: చట్టాలు వస్తాయని ఆశిస్తున్నా.. డీప్‌ ఫేక్‌ వీడియోపై స్పందించిన అలియా

అలియా భట్ (Alia Bhatt) డీప్‌ ఫేక్ వీడియో ఇటీవల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించారు.

Updated : 12 Dec 2023 20:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల కొందరు స్టార్‌ హీరోయిన్లు డీప్‌ ఫేక్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌ (Alia Bhatt) కూడా ఉన్నారు. తాజాగా రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌కు హాజరైన ఆమె ఈ వీడియోపై స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

‘‘డీప్‌ ఫేక్‌ గురించి చెప్పడానికి చాలా ఉంది. మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడే చెడు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సమస్యలు ఎన్ని వచ్చినా మనమంతా ముందుకు సాగాలి. మన జీవితాన్ని కొనసాగించాలి. అలాగే, సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలు కూడా కనుక్కోవాలి. అధునాతన సాంకేతికతతో కొందరు అద్భుతాలు చేస్తున్నారు. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిగే పనులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రక్షణ కల్పించేందుకు కచ్చితంగా చట్టాలు వస్తాయని నేను అనుకుంటున్నా’’ అని అలియా చెప్పారు.

దిల్‌రాజు నిర్మాతే కాదు.. సింగర్‌ కూడా.. ఆయన పాడిన పాటేంటో తెలుసా?

ఇక ఇటీవల రష్మిక (Rashmika) డీప్‌ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలియా భట్‌, కాజోల్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రాల డీప్ ఫేక్‌ వీడియోలు ఆందోళన కలిగించాయి. వీటిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రభుత్వం కూడా వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్‌ఫేక్‌ వీడియోలకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాల సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు