Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్‌

ఒకానొక సమయంలో తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని నటి అలియా భట్‌ (Aliabhatt) వెల్లడించారు. సినిమా పరాజయాలతో తన తండ్రి డబ్బుల్లేని పరిస్థితులు చూశారని ఆమె చెప్పారు.

Published : 01 Oct 2023 01:47 IST

ముంబయి: ఒకానొక సమయంలో తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని నటి అలియా భట్‌ (Alia Bhatt) తెలిపారు. వరుస సినిమా పరాజయాలతో తన తండ్రి మహేశ్‌ భట్‌ (Mahesh Bhatt) డబ్బుల్లేక ఇబ్బందిపడ్డారని.. దాంతో ఆయన మద్యానికి బానిసయ్యారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలియా చెప్పారు. పరిస్థితులు సాఫీగా మారడానికి ఎంతో సమయం పట్టిందన్నారు. ‘‘గతంలో మా నాన్న తెరకెక్కించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో ఆయన మద్యానికి బానిస అయ్యారు. కొంతకాలానికి ఆయన మద్యాన్ని వదిలేశారు. నా తల్లిదండ్రులిద్దరూ శ్రమించి.. మేము తిరిగి ఈ స్థాయికి వచ్చేలా చేశారు’’ అని ఆమె చెప్పారు.

అనంతరం తన తల్లి కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో అమ్మకు ఇక్కడ ఎవరితోనూ పరిచయాలు లేవు. థియేటర్స్‌, ఫిల్మ్‌ స్టూడియోస్‌, టీవీ స్టూడియోస్‌.. ఇలా ప్రతి ఆడిషన్‌కు ఆమె వెళ్లేవారు. హిందీ రాకపోవడం ఆమెకు మరో సమస్యగా మారింది. చిన్న ఆఫర్‌ వచ్చినా కాదనకుండా ఆమె వర్క్ చేసేవారు’’ అని తెలిపారు.

RC 16: రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌ కుమార్తె ఫిక్సా..?

‘ఆర్త్’, ‘డాడీ’, ‘కబ్జా’, ‘ఆషికీ’, ‘సడక్‌’, ‘క్రిమినల్‌’ వంటి చిత్రాలకు మహేశ్‌భట్‌ దర్శకత్వం వహించారు. ఫిల్మ్‌ మేకర్‌గా బాలీవుడ్‌లో ఆయనకు మంచి పేరు ఉంది. ఇక, ఆయన కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియాభట్‌.. నేడు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘హై వే’, ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘రాజీ’, ‘గల్లీ బాయ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘డార్లింగ్స్‌’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని