RC 16: రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌ కుమార్తె ఫిక్సా..?

రామ్‌చరణ్‌ (Ramcharan) - బుచ్చిబాబు (Buchibabu) ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌పై నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ నటి కుమార్తె ఈ సినిమాలో నటించనున్నారని మాట్లాడుకుంటున్నారు.

Published : 01 Oct 2023 01:47 IST

హైదరాబాద్‌: ‘ఉప్పెన’ (Uppena) ఫేమ్‌ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ 16వ ప్రాజెక్ట్‌గా ఇది సిద్ధం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ స్టార్‌ హీరోయిన్‌ కుమార్తె ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కనిపించనున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రవీనా టాండన్‌ (Raveena Tandon). ప్రస్తుతం సహాయ నటి పాత్రల్లో నటిస్తున్నారామె. ఇప్పుడు రవీనా కుమార్తె రాషా థడానీ (Rasha Thadani) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఓ హిందీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన రాషా తాజాగా రామ్‌చరణ్‌ సినిమా కోసం రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమె శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చినట్లు పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. లుక్‌ టెస్ట్‌ కోసమే ఆమె నగరానికి వచ్చారని పలువురు మాట్లాడుకుంటున్నారు. ‘ఆమె క్యూట్‌గా ఉంది. హీరోయిన్‌గా ఆమే ఫిక్స్‌ కావాలి’ అని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ వాయిదా.. చిత్ర యూనిట్‌ను బెదిరిస్తూ అభిమాని పోస్ట్‌..

స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈసినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తైన తర్వాత రామ్‌చరణ్‌ ఈ సినిమా మొదలుపెట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని