Subhashri: రెబల్‌గా ఉండేదాన్ని సాఫ్ట్‌గా మారా: శుభశ్రీ

తాను ఒకప్పుడు రెబల్‌గా ఉన్నానని, ఇప్పుడు సాఫ్ట్‌ అండ్‌ కూల్‌గా మారానని శుభశ్రీ అన్నారు.

Published : 08 Apr 2022 19:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను ఒకప్పుడు రెబల్‌గా ఉన్నానని, ఇప్పుడు సాఫ్ట్‌ అండ్‌ కూల్‌గా మారానని శుభశ్రీ అన్నారు. ‘అందరూ అందరే’, ‘పోకిరి రాజా’, ‘పెదరాయుడు’, ‘మా ఆవిడ కలెక్టర్‌’, ‘పెద్దన్నయ్య’, ‘అత్తా.. నీ కొడుకు జాగ్రత్త’, ‘అల్లరి పెళ్లికొడుకు’ తదితర చిత్రాలతో అలరించిన నటి ఈమె. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. సినిమా సంగతులతోపాటు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అసలు పేరు భారతీ పాండే కాగా ఇండస్ట్రీలోకి వచ్చాక శుభశ్రీ అయ్యానన్నారు. ఏడో తరగతి వరకు చదువుకున్నానని, బడికి వెళ్లకుండా ఉండేందుకే సినిమాల్లోకి వచ్చానని (నవ్వులు) తెలిపారు. ‘ఎంగ తంబి’ అనే తమిళ చిత్రంతో నటిగా కెరీర్‌ ప్రారంభమైందని చెప్పారు.

తన భర్త గురించి వివరిస్తూ.. ‘‘నేను స్నేహితులతో కలిసి ఆడుకునే సమయంలో వచ్చి నన్ను ప్రేమించేవారు. నాకు ఆయనిచ్చిన మొదటి బహుమతి డైమండ్‌ రింగ్‌. నిజం చెప్పాలంటే ఆయన నా తమ్ముడిలా కనిపిస్తారు. అంత సన్నగా ఉంటారు మరి (నవ్వుతూ..). కసరత్తులు చేయమని నన్ను రోజూ తిడుతుంటారు (సరదాగా..). నాకేమో బద్ధకం’’ అని చెప్పుకొచ్చారు. పూర్తి ఎపిసోడ్‌ ఏప్రిల్‌ 11న రాత్రి 9:30 గం.లకు ‘ఈటీవీ’లో ప్రసారంకానుంది. ప్రస్తుతం.. ప్రోమో విడుదలై అలరిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు