
Alluarjun: బన్నీని సర్‌ప్రైజ్ చేసిన అర్హ.. సంతోషంలో ఐకాన్‌స్టార్
హైదరాబాద్: ‘పుష్ప’తో ఇటీవల మరో సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ‘పుష్ప’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. తదుపరి సినిమాల షూటింగ్స్ ప్రారంభించడానికి ముందు వర్క్ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని టూర్ కోసం విదేశాలకు వెళ్లారు. ఇందులో భాగంగా దుబాయ్‌లో తీసుకున్న పలు ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అయితే, ఈ టూర్ కోసం సుమారు రెండు వారాల నుంచి ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు.
కాగా, హాలీడే ముగించుకుని శనివారం ఉదయం బన్నీ ఇంటికి చేరుకున్నారు. తన తండ్రి ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న అర్హ.. ఆయన్ని సర్‌ప్రైజ్ చేస్తూ స్పెషల్‌గా వెల్‌కమ్ చెప్పారు. గులాబీలు, కొన్ని రకాల ఆకులతో ‘వెల్‌కమ్ నాన్న’ అని గుమ్మం ఎదుటరాశారు. అది చూసిన బన్నీ ఆనందానికి గురయ్యారు. ‘‘16 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. అర్హ చెప్పిన స్వీట్ వెల్‌కమ్ నన్ను సంతోషానికి గురి చేసింది’’ అని పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా, ‘పుష్ప’ సక్సెసైన సందర్భంగా ‘AAFamily’ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసింది. ఆ ఫొటోలను బన్నీ షేర్ చేస్తూ ‘AAFamily’కి థ్యాంక్స్ చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.