AlluArjun: రాఖీభాయ్‌పై పుష్పరాజ్‌ ప్రశంసలు

రాఖీబాయ్‌ అలియాస్‌ యశ్‌పై పుష్పరాజ్‌ అలియాస్‌ అల్లు అర్జున్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. రాఖీబాయ్‌గా యశ్‌ నటన అదిరిందంటూ ట్వీట్‌ చేశారు. తాజాగా ‘కేజీయఫ్‌-2’ చిత్రాన్ని వీక్షించిన బన్న.....

Updated : 22 Apr 2022 15:28 IST

హైదరాబాద్‌: రాఖీభాయ్‌ అలియాస్‌ యశ్‌పై పుష్పరాజ్‌ అలియాస్‌ అల్లు అర్జున్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. రాఖీభాయ్‌గా యశ్‌ నటన అదిరిందంటూ ట్వీట్‌ చేశారు. తాజాగా ‘కేజీయఫ్‌-2’ వీక్షించిన బన్నీ సోషల్‌మీడియా వేదికగా చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ వరుస ట్వీట్లు పెట్టారు. ‘‘బిగ్గెస్ట్‌ సక్సెస్‌ని సొంతం చేసుకున్న ‘కేజీయఫ్‌-2’ టీమ్‌ మొత్తానికి నా అభినందనలు. రాఖీభాయ్‌గా యశ్‌ నటన, రవీనా టాండన్‌, సంజయ్‌దత్‌, శ్రీనిధి శెట్టితోపాటు ఇతర నటీనటుల స్క్రీన్‌ ప్రెజన్స్‌, అత్యద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, అదిరిపోయే విజువల్స్‌తో ‘కేజీయఫ్-2’ సూపర్‌గా ఉంది. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. సినిమా పట్ల ఆయనకున్న విజన్‌కు నా అభినందనలు. మన ఇండియన్‌ సినిమా పతాకాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు’’ అని బన్నీ తెలిపారు.

కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ‘కేజీయఫ్‌’ చిత్రం తెరకెక్కింది. 2018లో విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘కేజీయఫ్‌-2’ విడుదలైంది. యశ్‌ కథానాయకుడు. ప్రశాంత్‌నీల్‌ దర్శకుడు. సంజయ్‌ దత్‌, రవీనాటాండన్‌ కీలకపాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అందుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని