Amitabh Bachchan: రూ.50 కోట్ల బంగ్లా.. కుమార్తెకు గిఫ్ట్‌గా ఇచ్చిన అమితాబ్‌ బచ్చన్‌!

అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) తన కుమార్తె శ్వేతకు ఖరీదైన కానుక ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించే ప్రస్తుతం బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

Updated : 25 Nov 2023 16:54 IST

ముంబయి: అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) తన కుమార్తె శ్వేతకు అపురూపమైన బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబయిలోని జూహులో ఉన్న విలాసవంతమైన ప్రతీక్షా బంగ్లాను శ్వేతకు రాసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ పనులు కూడా మొదలుపెట్టారని సమాచారం. ఇక, నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ బంగ్లా ధర దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని టాక్‌.

Bobby Deol: నో స్వీట్స్‌.. నాలుగు నెలల కఠోర సాధన..: ‘యానిమల్‌’ విలన్‌ లుక్‌ ఇలా సాధ్యమైంది

ఇక, ముంబయిలోని పలు ప్రాంతాల్లో అమితాబ్‌ బచ్చన్‌కు మూడు బంగ్లాలు ఉన్నాయి. అమితాబ్ నటుడిగా తెరంగేట్రం చేసిన రోజుల్లో తల్లిదండ్రులతో కలిసి జూహులో ఉన్న ప్రతీక్షా బంగ్లాలోనే ఉన్నారు. దీని గురించి గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ప్రతీక్షా బంగ్లా అంటే మాకు ఎంతో ఇష్టం. ఆ ఇంటితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ ఇంటికి పేరు పెట్టింది మా నాన్నే. ఆయన రచనల్లోనూ మా ఇంటి పేరుని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి’’ అని అన్నారు. ఇదే నివాసంలో ఐశ్వర్యరాయ్‌ - అభిషేక్‌ బచ్చన్‌ వివాహం జరిగింది. ప్రస్తుతం అమితాబ్‌ ఉంటోన్న జల్సాకు దగ్గర్లోనే ప్రతీక్షా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని