సారీ చెప్పినా సరే.. అనసూయ కౌంటర్‌

తాను షేర్‌ చేసిన ఫొటోలపై కానీ, అభిప్రాయాలపై కానీ ఎవరైనా కామెంట్లు చేస్తే నటి అనసూయ వాళ్లపై కౌంటర్‌ ఎటాక్‌ చేస్తుంటారు. అలా ట్విటర్‌, ఇన్‌స్టా వేదికగా ఎన్నో సందర్భాల్లో ఆమె ఆగ్రహానికి గురయ్యారు....

Published : 20 Feb 2021 13:44 IST

నెటిజన్‌ కామెంట్‌కు నటి రిప్లై

హైదరాబాద్‌: తాను షేర్‌ చేసిన ఫొటోలు, అభిప్రాయాలపై ఎవరైనా కామెంట్లు చేస్తే నటి అనసూయ వాళ్లపై కౌంటర్‌ ఎటాక్‌ చేస్తుంటారు. అలా ట్విటర్‌, ఇన్‌స్టా వేదికగా ఎన్నో సందర్భాల్లో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ నెటిజన్‌పై మరోసారి ఆగ్రహానికి గురయ్యారు. నెటిజన్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమె మాత్రం కౌంటర్‌ సమాధానమిచ్చారు. ఇంతకీ ఆమె కోపానికి గురి కావడానికి కారణమేమిటంటే..

నటిగా, యాంకర్‌గా, అప్పుడప్పుడూ స్పెషల్‌సాంగ్స్‌లో తళుక్కున మెరిస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్న అనసూయ తరచూ తన స్టైలిష్‌ ఫొటోషూట్స్‌ని సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల లంగావోణిలో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. ఆమె షేర్‌ చేసిన వాటిల్లో ఓ ఫొటో గురించి తాజాగా ఓ నెటిజన్‌ స్పందించాడు. ‘అ ఆ’ సినిమాలోని సమంతతో అనసూయ ఫొటోని పోలుస్తూ.. ‘నువ్వు ఏమైనా సమంత అనుకుంటున్నావా?’ అంటూ ఓ మీమ్‌ క్రియేట్‌ చేశాడు. అది చూసిన అనసూయ.. ‘అయ్యో లేదమ్మా.. నన్ను అనసూయ అంటారు’ అని జవాబు ఇచ్చింది. అనంతరం సదరు నెటిజన్‌.. ‘క్షమించండి మేడమ్‌.. ఆట పట్టించడం(Kidding) కోసం నేను సరదాగా అన్నాను.’ అని రిప్లై ఇవ్వగానే.. ‘నాకర్థమైంది నువ్వు(మానసికంగా, బుద్ధిపరంగా అర్థం వచ్చేలా) చిన్నపిల్లాడివేనని(‘KID’DING). త్వరలోనే నువ్వు ఎదగాలని నేను కోరుకుంటున్నా.’ అని కౌంటర్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని