Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya) ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి గురువారం మృతి చెందారు.
హైదరాబాద్: బుల్లితెర నటి, యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya) ఇంట విషాదం నెలకొంది. గురువారం విష్ణుప్రియ తల్లి కన్నుమూశారు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ విష్ణు భావోద్వేగానికి గురైంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మై డియర్ లవ్లీ అమ్మా.. ఈ రోజు వరకూ నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా చివరి శ్వాస వరకూ గుర్తు చేసుకుంటూనే ఉంటా. నువ్వే నా బలం.. అలాగే బలహీనత కూడా. ఇకపై ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావు. ముఖ్యంగా నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ నువ్వు ఉంటావు. అలా, నేను బలాన్ని పొందుతాను. ఈ భూమ్మీద నాకంటూ ఓ మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు చేసిన త్యాగాలన్నింటికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని కన్నీటి పర్యంతమైంది.
తన తల్లిని హత్తుకున్న మరో ఫొటోని షేర్ చేస్తూ.. ‘‘ఇకపై నీ ముద్దులను మిస్ అవుతాను అమ్మా’’ అని పేర్కొంది. మరోవైపు విష్ణుకు ధైర్యం చెబుతూ పలువురు బుల్లితెర తారలు కామెంట్లు పెడుతున్నారు. విష్ణు కెరీర్ విషయానికి వస్తే.. ఈటీవీలో ప్రసారమైన ‘పోవే పోరా’తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బుల్లితెర వేదికగా ప్రసారమైన పలు కార్యక్రమాల్లో అలరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
టోల్ రుసుముల పెంపు అమలులోకి..
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం