Anni Manchi Sakunamule: అమెజాన్‌ ప్రైమ్‌లో ‘అన్ని మంచి శకునములే’ ట్రెండింగ్‌

సంతోష్‌ శోభన్‌, మాళవిక జంటగా నటించిన యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అన్ని మంచి శకునములే’. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు.

Published : 20 Jun 2023 12:36 IST

హైదరాబాద్‌: సంతోష్‌ శోభన్‌, మాళవిక జంటగా నటించిన యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అన్ని మంచి శకునములే’. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్‌లో ప్రేక్షకులను అలరించి,  జూన్ 17వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘అన్ని మంచి శకునములే’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న చిత్రాల్లో టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచినట్లు చిత్ర బృందం తెలిపింది. ముఖ్యంగా కుటుంబ చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు చెప్పింది.  అమెజాన్‌ ప్రైమ్‌లో రికార్డు అవర్స్‌ స్ట్రీమింగ్‌ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని