RRR: ‘ఆర్ఆర్ఆర్‌’ ఏ రోజున ఏం జరిగిందంటే?

RRR సినిమా ప్రకటన తేదీ నుంచి విడుదల వరకూ ఎప్పుడు ఏం జరిగింది? ఏ రోజున ఏం ప్రకటించారు? ఇలా ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 22 Mar 2022 16:41 IST

స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్‌ డ్రామా ‘ఆర్ఆర్‌ఆర్‌’. అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రకటన తేదీ నుంచి విడుదల వరకూ ఎప్పుడు ఏం జరిగింది? ఏ రోజున ఏం ప్రకటించారు? ఇలా ఆసక్తికర విశేషాలు మీకోసం..

  • 2017 నవంబర్ 18న రామ్ చరణ్, తారక్ లతో దిగిన ఫొటోను ట్విటర్ లో పంచుకున్న రాజమౌళి
  • 2018 మార్చి 22న చరణ్, తారక్‌లతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన రాజమౌళి
  • 2018 నవంబర్ 11న అల్యుమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం
  • 2018 నవంబర్ 19న సినిమా షూటింగ్ మొదలుపెట్టిన రాజమౌళి
  • 2019 మార్చి 14న రాజమౌళి, తారక్, చరణ్  మీడియా సమావేశం. #RRR కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజుల జీవితాల ఆధారంగా కల్పిత కథతో సినిమా చేస్తున్నట్లు వెల్లడి, 2020 జులై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటన
  • 2019 మార్చి 18న #RRR పేరుతో ట్విటర్ లో సినిమా వర్కింగ్ టైటిల్ ప్రకటన
  • 2020 మార్చి 25న #RRRకు రౌద్రం రణం రుధిరం... టైటిల్ ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల
  • 2020 మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు- రామరాజు ఇంట్రో వీడియో విడుదల

కరోనా కారణంగా షూటింగ్ వాయిదా

  • 2020 అక్టోబర్ 6న మళ్లీ షూట్ మొదలుపెట్టిన రాజమౌళి
  • 2020 అక్టోబర్ 22న ఎన్టీఆర్ కొమురంభీమ్ పాత్రను పరిచయం చేస్తూ రామరాజు ఫర్ భీమ్- భీమ్ ఇంట్రో వీడియో విడుదల
  • 2021 జులై 15న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ వీడియో విడుదల
  • 2021 ఆగస్టు 1న దోస్తి పాట విడుదల
  • 2021 నవంబర్ 1న 45 సెకన్లతో కూడిన గ్లిమ్స్ విడుదల
  • 2021 నవంబర్ 10న నాటు నాటు పాట విడుదల
  • 2021 నవంబర్ 26న  జనని పాట విడుదల
  • 2021 డిసెంబర్ 9న RRR  ట్రైలర్ విడుదల
  • 2021 డిసెంబర్ 24న కొమురంభీముడో పాట విడుదల

RRR విడుదల తేదీలు

  • మొదట ప్రకటించిన తేది - 2020 జులై 30, 2020
  • రెండో సారి 2021 జనవరి 8
  • మూడో సారి 2021 అక్టోబర్ 13
  • నాలుగో సారి 2022 జనవరి 7
  • ఐదో సారి 2022 మార్చి 18 లేదా ఏప్రిల్ 28
  • ఆరోసారి 2022 మార్చి 25

గమనిక: రెండేళ్ల కిందట టైటిల్ ఏ రోజు అయితే ప్రకటించారో అదే తేదీకి అంటే మార్చి 25కు సినిమా విడుదల అవుతుండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని