Anyas Tutorial: దెయ్యాలు ఉన్నాయా?.. ఆసక్తికరంగా అన్యాస్‌ ట్రైలర్‌..!

ప్రపంచం మొత్తం డిజిటల్‌వైపు అడుగులు వేస్తోంది. మరి అదే డిజిటల్‌ రంగం అందరినీ భయపెడితే? లైవ్‌లో దెయ్యం అంటూ

Published : 19 Jun 2022 16:06 IST

హైదరాబాద్‌: ప్రపంచం మొత్తం డిజిటల్‌వైపు అడుగులు వేస్తోంది. మరి అదే డిజిటల్‌ రంగం అందరినీ భయపెడితే? లైవ్‌లో దెయ్యం అంటూ సైబర్‌ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడితే? ఇంతకీ దెయ్యాలు ఉన్నాయా? అసలు అలాంటి పరిణామాలకి దారితీసిన పరిస్థితులు ఎలాంటివో తెలియాలంటే మా ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’(Anyas Tutorial) చూడాల్సిందే అంటున్నారు శోభు యార్లగడ్డ. ఆయన ఆర్కా మీడియా పతాకంపై నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ఇది. రెజీనా(Regina), నివేదితా సతీష్‌(Nivedhithaa) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జులై 1 నుంచి తెలుగు, తమిళంలో ఆహా ఓటీటీ వేదికలో ప్రసారం కానుంది. ఈ సిరీస్‌ ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి హైదరాబాద్‌లో విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని