Arabic Kuthu: విజయ్‌ పాటకు తారక్‌ స్టెప్పేస్తే..!

‘హలమిత్తి హబీబు’.. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇదే పాట. విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘బీస్ట్‌’లోని ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్‌నే షేక్‌ చేస్తోంది....

Published : 17 Feb 2022 17:00 IST

వీడియో వైరల్‌.. నెటిజన్ల ప్రశంసలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘హలమిత్తి హబీబు’.. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇదే పాట. విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘బీస్ట్‌’లోని ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్‌నే షేక్‌ చేస్తోంది. ప్రముఖ నటుడు శివకార్తికేయన్‌ అందించిన అరబిక్‌+తమిళ్‌ లిరిక్స్‌, అనిరుధ్‌ ఇచ్చిన బీట్‌, విజయ్‌-పూజా హెగ్డే స్టెప్పులు.. ఇలా ‘అరబిక్‌ కుత్తు’ పాట ఇప్పుడు ప్రతిఒక్కరితో డ్యాన్స్‌ చేయిస్తోంది. ఇప్పటివరకూ 4 కోట్ల వ్యూస్‌తో ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

కాగా, ఇప్పుడు ఈ పాటకు ప్రతి ఒక్కరూ సరికొత్త వీడియోలు, రీల్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ అభిమాని ఎన్టీఆర్‌ డ్యాన్స్‌కు ‘అరబిక్‌ కుత్తు’ సాంగ్‌ని యాడ్‌ చేసి ఓ స్పెషల్‌ వీడియో సృష్టించాడు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ‘లవ్‌ దెబ్బ’ పాటకు రకుల్‌ - ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులకు ‘అరబిక్‌ కుత్తు’ పాటను యాడ్‌ చేసి దాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా.. అది చూసిన నెటిజన్లు.. సదరు అభిమానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని