Arjun Bijlani: ఆసుపత్రిలో చేరిన నటుడు.. త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌..

నటుడు అర్జున్‌ బిజ్లానీ కడుపునొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరారు.

Published : 09 Mar 2024 13:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు అర్జున్‌ బిజ్లానీ (Arjun Bijlani) ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తెలిపారు. నాగిని సీరియల్‌తో తెలుగు వారికి  చేరువైన అర్జున్‌  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్‌ అభిమానులను కలవరపెడుతోంది. ‘తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఏది జరిగినా మన మంచికే’ అంటూ ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

విడాకుల వార్తలకు చెక్‌.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన నయన్‌ దంపతులు

సీరియల్స్, రియాల్టీ షోల ద్వారా అర్జున్‌ ఎంతోమందికి అభిమాన నటుడిగా మారారు. తన నటనతో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. నాగిని రెండు సీజన్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ‘ఇండియా గాట్‌ టాలెంట్‌’ అనే షోకు యాంకర్‌గా వ్యవహరించారు. వీటితో పాటు రెండు వెబ్‌సిరీస్‌లు, పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లతో అలరించారు. తాజాగా అలియాభట్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన  ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని