Ashokavanamloo Arjuna Kalyanam: అసలు పెళ్లెందుకు చేసుకోవాలి: విశ్వక్‌సేన్‌

‘‘అసలు నేను పెళ్లెందుకు చేసుకోవాలి? చుట్టాలు అడుగుతున్నారని చేసుకోవాలా? వయసు అయిపోతుందని చేసుకోవాలా? లేకపోతే అందరూ చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా చేసుకోవాలా?’’ అని అడుగుతున్నారు...

Updated : 07 Dec 2022 22:22 IST

హైదరాబాద్‌: ‘‘అసలు నేను పెళ్లెందుకు చేసుకోవాలి? చుట్టాలు అడుగుతున్నారని చేసుకోవాలా? వయసు అయిపోతుందని చేసుకోవాలా? లేకపోతే అందరూ చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా చేసుకోవాలా?’’ అని అడుగుతున్నారు నటుడు విశ్వక్‌సేన్‌. ఆయన కథానాయకుడిగా విజయం సొంతం చేసుకున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. విద్యాసాగర్‌ చింత దర్శకుడు. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈసినిమా జూన్‌ 3 నుంచి ఆహా వేదికగా ప్రేక్షకుల అందుబాటులో ఉందనుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ట్రైలర్‌ని ఆహా విడుదల చేసింది. ‘‘సూర్యపేట మొత్తంలో ఒకటే టాపిక్‌. అర్జున్‌కుమార్‌ అల్లంగాడికి పెళ్లి కాలేదు.. పెళ్లి కాలేదు.. పెళ్లి కాలేదని..’’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. విశ్వక్‌, రుక్సర్‌ దిల్లాన్‌ నటన మెప్పించేలా సాగింది. ఇక, ట్రైలర్‌ చివర్లో విశ్వక్‌సేన్‌ చెప్పే డైలాగ్‌లు మనసుని హత్తుకునేలా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని