Published : 01/04/2021 01:09 IST

ఇప్పుడు వాళ్లే నా స్నేహితులు: షారుఖ్‌ఖాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు స్నేహం చేయడం తెలియని తనకు ప్రస్తుతం చాలామంది స్నేహితులున్నారని బాలీవుడ్ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ అన్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ‘పఠాన్‌’ సినిమాతో తెరపై కనిపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఆ సినిమాలో మరో స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ కూడా కనిపించినున్నారు. కాగా.. ట్విటర్‌ వేదికగా షారుఖ్‌ తన అభిమానులతో సరదాగా సంభాషించారు. #AskSRK పేరుతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా తన రాబోయే సినిమాలు, సహనటులతో పాటు పలు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారాయన.

మీ ట్విటర్‌ ఖాతాలో మీ వివరాలు లేకపోవడానికి కారణం..?

నా జీవితం చాలా వరకు గడిచిపోయింది. కేవలం ట్విటర్‌ బయోలో దాన్ని పరిమితం చేయడం కష్టం.

మీరు ఒక పెద్దస్టార్‌ హీరో.. సాధారణ జీవితం గడపాలని ఎప్పుడైనా కోరుకున్నారా..?

నాది సాధారణ జీవితమే. నాదే కాదు మనందరివీ సాధారణ జీవితాలే.. జీవన విధానాలు మాత్రమే భిన్నంగా ఉంటాయంతే.

మీ తర్వాతి సినిమా అప్డేట్‌ ఇవ్వండి ప్లీజ్‌

ప్రస్తుతం చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మన వంతు కూడా వస్తుంది ఎవరూ చింతించకండి.

అమ్మాయిలను ఆకట్టుకోవడానికి చిట్కాలు చెప్పండి..?

వాళ్లతో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించండి

మిమ్మల్ని కలుసుకునే క్షణం కోసం మేం ఎంతగానో ఎదురు చూస్తున్నాం

మనమంతా కలుసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ.. ప్రస్తుతం నేను బయటకు రావడం లేదు. కాబట్టి అభిమానులు గుంపులుగా చేరవద్దు. అతి త్వరలోనే వీటన్నింటినీ అధిగమించి మనం కలుసుకుందాం.

సర్ జీవితం బోరింగ్‌గా ఉంది. మీ నుంచి కొంత ప్రేరణ కావాలి.

లైఫ్‌ బోర్‌ అనిపించినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఏవైనా ఆటలు ఆడండి.

స్థిరత్వం, అభిరుచి.. రెండింట్లో అభిరుచిని ఎంచుకోవడం సరైందేనా?

మన అభిరుచి సాధారణంగా ఆదాయంపై గ్యారెంటీ ఇవ్వలేదు. కాబట్టి అభిరుచితో పాటు స్థిరత్వంపై దృష్టిపెడితే మంచిది. రెండింటినీ వేర్వేరుగా చూడకూడదు.

ఈ ఏడాది కోల్‌కతా జట్టు ఐపీఎల్‌ ట్రోఫీ గెలుస్తుంది అనుకుంటున్నారా..?

ఆటగాళ్లంతా ఆరోగ్యంగా ఉంటూ వాళ్ల క్రికెట్‌తో మనకు వినోదం పంచేందుకు ఉత్తమంగా కృషి చేయాలి. ట్రోఫీ వస్తే నేను అందులోనే కాఫీ తాగుతా.

మిమ్మల్ని తెరపై ఎప్పుడు చూడబోతున్నాం..

మేం కూడా అందుకోసమే పనిచేస్తున్నాం.

అనౌన్స్‌మెంట్‌ ఎప్పుడు చేస్తారు..?

అనౌన్స్‌మెంట్‌ అనేది ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్‌కు సంబంధించింది మై ఫ్రెండ్‌. సినిమాలకు అలాంటివి అవసరం లేదు.

తర్వాతి సినిమా గురించి ఏదైనా హింట్ ఇవ్వండి ప్లీజ్‌..

స్ట్రాంగ్‌ హింట్‌: నా తర్వాతి అన్ని సినిమాల్లో నేనే ప్రధానపాత్ర పోషిస్తున్నాను. ఎవరికీ చెప్పకండి ప్లీజ్‌.
 

అందం విషయంలో ఆత్మన్యూనతకు గురయ్యే అమ్మాయిలకు మీరిచ్చే సలహా..?

అమ్మాయిలందరూ అందమైనవాళ్లే. ఒకరితో ఒకరు పోల్చుకోవద్దు. మీరెంతో ప్రత్యేకమనే విషయాన్ని మర్చిపోవద్దు.

ఒక తండ్రిగా మీరు మీ పిల్లలతో కఠినంగా ఉంటారా..?

పిల్లలు ఉన్నదే మనం ప్రేమించేందుకు.. పొరపాట్లు చేసేందుకు.. అంతేకాని మందలించడానికో లేదా వాళ్లతో కఠినంగా ఉండటానికో కాదు.

మీ ఆరోగ్య చిట్కా ఏంటీ.?

నేను తక్కువగా తింటాను.

1. కోల్‌కతా ఐపీఎల్‌ ట్రోఫీ 2. మీ సినిమా రూ.600కోట్లు వసూలు చేయడం. ఈ రెండింట్లో ఏది ఎంపిక చేసుకుంటారు.?

నేను ఐచ్ఛిక ప్రశ్నల ఎంపికలో అంత ప్రతిభగల వాడిని కాదు. అన్ని సమాధానాలు సరైనవి కావాలని కోరుకుంటాను.

ఆమిర్‌ఖాన్‌ సినిమాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం..?

రాఖ్‌, కయామత్‌ సే కయామత్‌ తక్‌, దంగల్‌, లగాన్‌, 3 ఇడియట్స్‌

స్నేహం చేయడం ఎలాగో తెలియదని ఒకప్పుడు చెప్పారు కదా.. ఇప్పుటికీ అలాగే ఉన్నారా..?

లేదు. ఇప్పుడు నా పిల్లలు నాకు స్నేహితులయ్యారు.

సల్మాన్‌ఖాన్‌ గురించి ఏదైనా చెప్పండి..?

భాయ్‌ ఎప్పటికైనా భాయ్‌.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని