Avatar: వింత జీవులు.. కొత్త యాక్షన్‌

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌’. దీనికి కొనసాగింపుగా రానున్న చిత్రానికి టైటిల్‌ను దర్శక నిర్మాతలు గురువారం అధికారికంగా ప్రకటించారు. నీటి అడుగు భాగాన ఈ కథ జరుగుతుందన్న అంచనాలకు అనుగుణంగా ‘అవతార్‌.. ది వే ఆఫ్‌ వాటర్‌’ అనే...

Updated : 29 Apr 2022 08:10 IST

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌’. దీనికి కొనసాగింపుగా రానున్న చిత్రానికి టైటిల్‌ను దర్శక నిర్మాతలు గురువారం అధికారికంగా ప్రకటించారు. నీటి అడుగు భాగాన ఈ కథ జరుగుతుందన్న అంచనాలకు అనుగుణంగా ‘అవతార్‌.. ది వే ఆఫ్‌ వాటర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లాస్‌ వేగస్‌లో జరిగిన సినిమాకాన్‌ కార్యక్రమంలో ప్రదర్శించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లిపోయిందని తెలుస్తోంది. పండోరా ప్రపంచంలోని ఎగిరే జీవి టోరుక్‌తో పాటు వేల్స్‌ తరహా కొత్త జీవులు ఈ సినిమాలో కనిపించనున్నాయని సమాచారం. డిసెంబర్‌ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు డిస్నీ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాకు రెండు నెలలు ముందుగా సెప్టెంబరు 23న ‘అవతార్‌ 1’ను మరో సారి విడుదల చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని