Avatar2: కొత్త ప్రపంచం.. సరికొత్త జీవులు.. అవతార్‌ ట్రైలర్‌ అద్భుతం

‘పండార గ్రహం.. అక్కడి అద్భుత ప్రకృతి,  విచిత్రమైన జంతువులు, ఉనికి కోసం పోరాడే అక్కడి జీవజాతి...’ ఇలా ప్రతీ ఒక్కటీ సినీ ప్రేక్షకులకు పరిచయమే.

Published : 02 Nov 2022 19:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పండార గ్రహం.. అక్కడి అద్భుత ప్రకృతి,  విచిత్రమైన జంతువులు, ఉనికి కోసం పోరాడే అక్కడి జీవజాతి...’ ఇలా ప్రతీ ఒక్కటీ సినీ ప్రేక్షకులకు పరిచయమే. జేమ్స్‌ కామరూన్‌ (James Cameron) తెరకెక్కించిన ‘అవతార్‌’ (Avatar) 2009లో విడుదలై వీటిని మన కళ్లముందు ఉంచింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘అవతార్‌-2’ తీస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 16న ఇది విడుదల కానుంది. ఈ  నేపథ్యంలో ‘అవతార్‌’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. గత చిత్రంతో పోలిస్తే, కామరూన్‌ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆద్యంతం అలరించేలా సాగే ఆ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు