Banaras: రియల్‌ లైఫ్‌లో టైమ్‌ ట్రావెలింగ్‌ సాధ్యమేనా .. ఉత్కంఠగా ‘బనారస్‌’ ట్రైలర్‌

జైద్‌ ఖాన్‌, సోనాల్‌ మాంటెరో జంటగా జయతీర్థ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘బనారస్‌’. తిలకరాజ్‌ బల్లాల్‌ నిర్మాత.

Published : 26 Sep 2022 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జైద్‌ ఖాన్‌ (Zaid Khan), సోనాల్‌ మాంటెరో (Sonal Monteiro) జంటగా జయతీర్థ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘బనారస్‌’ (Banaras). సుజయ్‌ శాస్త్రి, దేవరాజ్‌, అచ్యుత్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. బనారస్‌ (వారణాసి) సిటీ నేపథ్యంలో సాగే స్టోరీ ఇది అర్థమవుతోంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ చూడ ముచ్చటగా ఉంది. ‘రియల్‌ లైఫ్‌లో టైమ్‌ ట్రావెలింగ్‌ సాధ్యమైనా?’ అని హీరోయిన్‌.. హీరోని అడిగే సన్నివేశంలో కనిపించే దృశ్యాలు ఉత్కంఠను రేకెత్తించేలా ఉన్నాయి. మరి, ‘బనారస్‌’లో చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనలేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts