Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష

Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఒంగోలు మున్సిఫ్‌ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.

Updated : 14 Feb 2024 14:11 IST

ఒంగోలు న్యాయ విభాగం: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు (Bandla Ganesh) ఏడాది జైలు శిక్షపడింది. బాకీ చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్కు చెల్లని కేసులో ఒంగోలు  రెండో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ పి.భానుసాయి  జైలు శిక్ష, జరిమానా విధించారు.

జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్లగణేష్‌ రూ.95 లక్షలు చెల్లించాల్సి ఉండగా, అందుకు సంబంధించి నగదును చెక్‌ రూపంలో ఇచ్చారు.  వెంకటేశ్వర్లు ఆ చెక్‌ను నగదుగా మార్చుకునే నిమిత్తం బ్యాంకుకు తీసుకెళ్లగా ఖాతాలో నగదు లేకపోవడంతో అది  కాస్తా బౌన్స్‌ అయ్యింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

కేసును విచారించిన మేజిస్ట్రేట్‌ నిందితుడిపై నేరం రుజువు  కావడంతో ఏడాది జైలు శిక్ష, రూ.95.10 లక్షలు జరిమానా వేశారు. జరిమానాలోని రూ.95 లక్షలను ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పును అప్పీలు చేసుకునేందుకు కోర్టు నెలరోజుల గడువు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని