Beast: ఒకే లొకేషన్, ఒకే కాస్ట్యూమ్.. ‘బీస్ట్’ ఓ సవాలు: నెల్సన్
‘డాక్టర్’తో కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ఇప్పుడాయన ‘బీస్ట్’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘డాక్టర్’తో కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ఇప్పుడాయన ‘బీస్ట్’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ స్వరాలందించిన ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. నెల్సన్, పూజాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివీ..
దిల్ రాజు: ‘బీస్ట్’ ఎలా ఉంటుంది? విజయ్‌ని ఎలా ఒప్పించారు?
నెల్సన్: విజయ్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాశా. చెప్పిన వెంటనే ఆయనకు బాగా నచ్చింది. అందుకే ఆయన్ను ఒప్పించేందుకు పెద్ద కష్టపడలేదు. ఈ సినిమాలో 70 శాతం యాక్షన్, 30 శాతం కామెడీ ఉంటుంది. మునుపటి నా సినిమాలతో పోలిస్తే ‘బీస్ట్’ ప్రత్యేకమైంది. కథ దృష్ట్యా ఇందులో రెండు పాటలకే స్కోప్ ఉంది. ఆ రెండింటికీ శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. ఒక్క లొకేషన్లోనే ఈ చిత్రాన్ని తీశా. పాటలు మినహా నటీనటులంతా ఒకే కాస్ట్యూమ్‌లో కనిపిస్తారు. ట్రైలర్‌కు వచ్చిన ఆదరణ చూశాక చెప్పలేనంత ఆనందం కలిగింది.
దిల్ రాజు: విజయ్ సినిమాలకు భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది మీరు ఒకే లోకేషన్, ఒకే కాస్టూమ్ అంటున్నారు. మీ నమ్మకమేంటి?
నెల్సన్: నేను విజయ్‌తో విభిన్నంగా సినిమా తీయాలనుకున్నా. తను ఇప్పటి వరకూ కనిపించని లుక్‌లో ఉండాలనుకున్నా. కథ డిమాండ్ చేయడం వల్లే లొకేషన్, కాస్ట్యూమ్ విషయంలో ఆ నిర్ణయం తీసుకొన్నా. దీన్ని ఓ సవాలుగా స్వీకరించా.
దిల్ రాజు: విజయ్‌తో నటించడం ఎలా అనిపించింది?
పూజాహెగ్డే: నటిగా నా కెరీర్ తమిళ సినిమాతోనే ప్రారంభమైంది. ఇప్పుడు ‘బీస్ట్’తో కోలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టుంది. సుమారు పదేళ్ల తర్వాత స్ట్రైయిట్ ఫిల్మ్‌తో తమిళ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నా. సినిమా విడుదలైన రోజు తొలి ఆటను ప్రేక్షకులతో కలిసి చూడాలని నిర్ణయించుకున్నా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం విజయ్‌ది. తన మొదటి సినిమాకి ఎంత కష్టపడ్డారో ఇప్పటికీ అలానే కష్టపడుతున్నారు. ఈ విషయంలో ఆయన నాకు స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి ఆయనతో తెరను పంచుకోవడం మాటల్లో చెప్పలేనంత ఆనందానిచ్చింది. అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే.. సినిమా అంతా ఒకే లొకషన్లో జరగరడంతో 20 రోజుల షెడ్యూల్ ఒకే రోజులో పూర్తయినట్టు అనిపించింది.
పూజాహెగ్డే : నా గురించి విజయ్ మీకేం చెప్పారు?
దిల్ రాజు: తన తర్వాత సినిమాలో కూడా నిన్నే హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నారట (నవ్వుతూ..). సెట్స్‌లో నువ్వెలా ఉంటావో తెలిపారు. నీ చలాకీతనం, సమయపాలన గురించి వివరించారు.
దిల్ రాజు : సంచలనం సృష్టించిన ‘అరబిక్ కుతు’ పాట గురించి వివరిస్తారా?
నెల్సన్: నేను అనిరుధ్‌ని ఒక మంచి హిట్ సాంగ్ కావాలని, అది అన్ని భాషల వారికీ నచ్చాలని చెప్పా. ఈ క్రమంలో వచ్చిందే ‘అరబిక్ కుతు’ ట్యూన్. ఇది సూపర్‌హిట్ అవుతుందని ముందే ఊహించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.