RP Patnaik: ఆర్పీ పట్నాయక్‌ మరో ప్రయోగం.. ఆడియో రూపంలో ‘భగవద్గీత’

RP Patnaik: నేటి యువత కోసం భగవద్గీతను తీసుకురానున్నట్లు ఆర్పీ పట్నాయక్‌ ప్రకటించారు.

Published : 11 Feb 2024 02:25 IST

హైదరాబాద్‌: సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన ఆర్పీ పట్నాయక్‌ (RP Patnaik) మరో ప్రయోగంతో అందరి ముందుకురాబోతున్నారు. ఇప్పటివరకూ ‘భగవద్గీత’ అంటే తెలుగు వారికి ఘంటసాల గుర్తొచ్చేవారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ‘భగవద్గీత’ రూపంలో ఆయన గొంతు సజీవమే. ఇప్పుడు అదే గీతను నేటి యువత కోసం అందించడానికి సిద్ధమయ్యారు ఆర్పీ పట్నాయక్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా ప్రకటన చేశారు.

‘‘నేటి యువతకు సరైన మార్గనిర్దేశం చేసే అత్యద్భుత తత్వజ్ఞానం, జీవనమార్గం చూపించే శాస్త్రం భగవద్గీతకు మించి ఇంకెక్కడా దొరకదు. అందరికీ అర్థమయ్యేలా ఈ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం (సంస్కృత శ్లోకాలు లేకుండా) నేటి యువత కోసం నేను రికార్డ్ చేశాను. పూర్తి వివరాలతో త్వరలోనే వస్తాను’’ అని ట్వీట్ చేశారు. మరి ఆర్పీ పట్నాయక్‌ తీసుకురాబోయే గీతాసారం ఆయనే స్వయంగా స్వరపరిచారా? లేక వేరెవరితోనైనా చెప్పించారా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. సంగీత దర్శకుడిగానే కాకుండా గాయకుడు, నటుడు, దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్‌ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని