Bhagavanth kesari: ‘భగవంత్‌ కేసరి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. గీ సారి దసరా జోర్దార్‌

Bhagavanth kesari: బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్‌ కేసరి’ విడుదల తేదీ ఖరారైంది.

Published : 22 Jul 2023 15:02 IST

హైదరాబాద్‌: భగవంత్‌ కేసరి’గా దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. అర్జున్‌ రాంపాల్‌, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబరు 19న ఈ (Bhagavanth kesari release date) చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘భగవంత్‌ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ గన్స్‌ పట్టుకుని బాలకృష్ణ నడిచి వస్తున్న ఫొటోను పంచుకున్నారు.

ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ‘రాజు ఆని ఎనకున్న వందల మంది మందను చూయిస్తడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు’’ అంటూ బాలకృష్ణ చెప్పే శక్తిమంతమైన డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్‌ కేసరి. ఈపేరు శానా యేండ్లు యాదుంటది’ అంటూ టీజర్‌ ఆఖర్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని