
Bigg Boss telugu 5: ఎవరు ఏ స్థానంలో ఉండాలో ఏకాభిప్రాయం వచ్చినట్టేనా?
హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు-5(Bigg boss telugu 5)లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే గెలుచుకుని టాప్-5లో ఒకడిగా నిలిచాడు. ఇక హౌస్‌లో ఆరుగురు సభ్యులు ఉండగా, ఎవరు ఏ నంబర్‌లో ఉండాలన్న టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ‘అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఒకటి నుంచి ఆరు వరకూ మీ స్థానాలను నిర్ణయించుకుని అందుకు సంబంధించిన ర్యాంకుల వెనకాల నిలబడండి’ అని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో సన్నీ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఫైట్ ఒకటో నంబర్ గురించే.. నేను వెళ్లి ఫస్ట్‌లో ఉంటా’ అని అనడం నవ్వులు పూయిస్తోంది. ఫస్ట్ నంబరు బోర్డును తన దగ్గర ఉంచుకుంటానంటూ హంగామా చేశాడు. ఆ తర్వాత కాజల్ ఒకటో నంబర్ బోర్డు వద్దకు వస్తే.. ‘అతిగా ఆశ పడే ఆడది.. అతిగా ఆవేశ పడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అంటూ సన్నీ పంచ్‌డైలాగ్‌లు కొట్టాడు. చివరిగా షణ్ముఖ్ మాట్లడుతూ.. ‘నేను అలా ఆడను. నిజమైన వ్యక్తి పేరు చెబుతా’ అని అంటే, ‘పర్‌ఫెక్ట్ అయితే ఫస్ట్ వచ్చి ఆడు’ అంటూ సన్నీ చెప్పడంతో ఎవరు? ఏయే స్థానాల్లో నిలబడతారా? అన్న ఆసక్తి మొదలైంది.