Brahmanandam: అందుబాటులోకి బ్రహ్మానందం ఆటోబయోగ్రఫీ.. చిరంజీవి పోస్ట్‌

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) ఆటోబయోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ వేదికగా ఈ పుస్తకం ప్రస్తుతం అందుబాటులో ఉంది.

Published : 29 Dec 2023 02:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన జీవితకథను వివరిస్తూ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) ఓ పుస్తకం రాశారు. ‘నేను’ అనే పేరుతో ప్రచురితమైన తన ఆటోబయోగ్రఫీ కాపీని తాజాగా చిరంజీవి (Chiranjeevi) కి అందించారు. ఈ మేరకు చిరు ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘నాకు అత్యంత ఆప్తుడు, ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందాన్ని అందించిన వ్యక్తి మనందరి బ్రహ్మానందం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకు ఎదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకు అందించడం ఆనందంగా ఉంది.

ఆయన చెప్పినట్టు ‘ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం, మార్గదర్శకం కావొచ్చు. చదివే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, దీనిని రాసిన ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. ఈ పుస్తక ప్రచురణ కర్తలను అభినందిస్తున్నా’’ అని చిరంజీవి పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పుస్తకం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.275. తెలుగు అధ్యాపకుడిగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘చంటబ్బాయ్‌’తో తెరంగేట్రం చేసిన ఆయన హాస్యనటుడిగా ఎన్నో వందల చిత్రాల్లో నటించారు. హాస్యనటుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని