Chandrababu: భారతీ సిమెంట్‌పై లేని నియంత్రణ ‘భీమ్లానాయక్’పై ఎందుకు?
సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం...
హైదరాబాద్: సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం చంద్రబాబు వరుస ట్వీట్లు పెట్టారు. ‘‘రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ ముఖ్యమంత్రి జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారు. ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తోన్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది. వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ ధరపై లేని నియంత్రణ ‘భీమ్లానాయక్’ సినిమాపై ఎందుకు? ప్రపంచస్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తోన్న జగన్... తన మూర్ఖపు వైఖరి వీడాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజాసమస్యలు అన్నీ పక్కన పెట్టి, థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వతీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమవారిని రక్షించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం ‘భీమ్లానాయక్’పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తప్పులను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. నిలదీస్తుంది..! ‘భీమ్లానాయక్’ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని చంద్రబాబు అన్నారు.
మరోవైపు నారా లోకేశ్ సైతం థియేటర్లపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ‘‘భీమ్లానాయక్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ఆ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా. జగన్.. ఒక్కో పరిశ్రమను ధ్వంసం చేస్తున్నారు. పరిశ్రమల ధ్వంసంతో రాష్ట్ర ప్రజలు భిక్షాటన చేసే పరిస్థితికి తెచ్చారు. సినీ పరిశ్రమ ఇందుకు మినహాయింపు కాదు. అడ్డంకులను అధిగమించి ఈ సినిమా విజయం సాధించాలి’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్