Chandramukhi 2: ‘చంద్రముఖి2’ రన్‌టైమ్‌.. వామ్మో అన్ని గంటలా..!

‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Published : 15 Sep 2023 10:49 IST

హైదరాబాద్‌ : రాఘవ లారెన్స్‌ (Lawrence), కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా  ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ సినిమాపై అంచనాలు పెంచగా..  ప్రస్తుతం ఈ చిత్ర రన్‌టైమ్‌ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఈ సినిమా రన్‌టైమ్‌ ఏకంగా 170 నిమిషాలట (2 గంటల 50నిమిషాలు). ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. ఇంత నిడివి ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందుకు తగిన కథ, కథనాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండాలి. ఈ విషయంలో ‘చంద్రముఖి2’ దర్శకుడు పి.వాసుతో పాటు చిత్రబృందమంతా పూర్తి విశ్వాసంతో ఉందట. ఇక ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) రాజనర్తకిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. 2005లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ , జ్యోతిక, నయనతార నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) అందరినీ భయపెట్టి ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఈ ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. ఎం.ఎం.కీరవాణి సంగీతమందించగా.. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది.

ఆ నలుగురు ప్రముఖ నటులకు రెడ్‌కార్డు!

మొదట ఈ సినిమాను సెప్టెంబర్‌ 15 విడుదల చేయాలని భావించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల విడుదల తేదీని సెప్టెంబరు 28కి మార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని