వెన్నునొప్పి భరిస్తూనే బాలకృష్ణ మూవీలో డ్యాన్స్ చేశా: చంద్రిక రవి
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన చంద్రిక రవి పంచుకున్న ఆసక్తికర విషయాలు..
బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీతం అందించిన పాటలు ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఐటమ్ సాంగ్ ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి’ విశేషంగా అలరిస్తోంది. ఇందులో బాలకృష్ణ సరసన ఆడిపాడింది చంద్రిక రవి. ఈ నేపథ్యంలో చంద్రిక రవి పంచుకున్న విశేషాలు..
‘‘మా బావ మనోభావాలు పాట విడుదలైన గంటల్లోనే 10 మిలియన్స్ వ్యూస్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఓ చిన్న టౌన్‌లో పుట్టా. అయితే మా కుటుంబ మూలాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి దక్షిణాది సినిమాలు చూస్తూ పెరిగా. నా కెరీర్‌లో ఇంత త్వరగా ఇంత పెద్ద అవకాశం వస్తుందని అనుకోలేదు.’’
‘‘నాకు మూడేళ్ళు ఉన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి నృత్యరూపకాలను మా తల్లిదండ్రులు నేర్పించారు. అలాగే వెస్ట్రన్ కల్చర్స్‌కి సంబంధించిన డ్యాన్సులు కూడా నేర్చుకున్నా. మా అమ్మ మంచి డ్యాన్సర్. నాన్న తబలా వాయిస్తారు. ఈ రకంగా సౌత్ ఇండియన్ కల్చర్, ఆర్ట్ అనేది నా జీవితంలో అంతర్భాగమైంది’’
‘‘బాలకృష్ణగారితో పని చేయడం ఒక కల నెరవేరినట్లయింది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. జీవితం, సినిమాల పట్ల ఆయనకున్న పరిజ్ఞానం అమోఘం. ఎన్నో గొప్ప విషయాలని పంచుకున్నారు. ఈ జ్ఞాపకాలని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’
‘‘మా బావ మనోభావాలు పాట చిత్రీకరణ చివరిలో నా వెన్ను కాస్త బెణికింది. నొప్పి బాధ పెట్టింది. ఈ సంగతి సెట్‌లో ఎవరికీ చెప్పలేదు. డ్యాన్సర్స్ అంతా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేస్తున్నారు. వారి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నొప్పిలోనే నా శక్తిమేరకు కృషి చేశా. ఎందుకంటే ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారే వస్తుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపిచంద్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కి నొప్పి గురించి చెప్పాను. ‘నొప్పితో బాధపడుతున్నావ్ అని మాకసలు తెలీదు. చాలా అద్భుతంగా చేశావు’ అని చెప్పారు. పాట విడుదలైన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తే కష్టానికి తగిన ఫలితం దక్కిందనిపించింది. ప్రస్తుతం కొన్ని తమిళ్ సినిమాలు చేస్తున్నా. అలాగే ఒక తెలుగు సినిమా చర్చల దశలో ఉంది. అలాగే యుఎస్‌లో కొన్ని షోస్ కూడా ప్లానింగ్ లో ఉన్నాయి’’
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
-
Crime News
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
-
Sports News
IND vs AUS : ‘రోహిత్-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే
-
Politics News
KTR: మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్