Chinmayi: ఒకేవేదికపై స్టాలిన్‌, కమల్ హాసన్‌, వైరముత్తు,.. చిన్మయి విస్మయం

కోలీవుడ్‌ సినీ గేయ రచయిత వైరముత్తు (Vairamuthu)తో కలిసి తమిళనాడు(Tamil Nadu)కు చెందిన కొందరు ప్రముఖ నేతలు ఒకే వేదికపై కనిపించడంతో సింగర్ చిన్మయి(Chinmayi Sripaada) విస్మయం వ్యక్తంచేశారు. 

Updated : 02 Jan 2024 17:54 IST

చెన్నై: తమిళనాడు(Tamil Nadu)కు చెందిన కొందరు ప్రముఖులపై గాయని చిన్మయి శ్రీపాద(Singer Chinmayi Sripaada) అసహనం వ్యక్తం చేశారు. కోలీవుడ్‌ సినీ గేయ రచయిత వైరముత్తు (Vairamuthu)తో పాటు సీఎం ఎంకే స్టాలిన్‌, కాంగ్రెస్‌ సీనియర్ నేత చిదంబరం, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ ఒకే వేదికపై కనిపించిన నేపథ్యంలో ఆమె నుంచి ఈ స్పందన వచ్చింది.

‘నన్ను వేధింపులకు గురిచేసిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు వేదికపై ఉన్నారు. అతడి గురించి బయటకు చెప్పిన నేను మాత్రం నిషేధానికి గురయ్యాను. కొన్నేళ్లపాటు నా వృత్తి జీవితాన్ని కోల్పోయాను. నా కోరిక నెరవేరేవరకు ప్రార్థించడం మినహా నేను చేసేది ఏమీలేదు’ అని చిన్మయి విస్మయం వ్యక్తం చేశారు. వైరముత్తు రచించిన ‘Maha Kavithai' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా వీరంతా ఒకే వేదికపై కనిపించారు. స్టాలిన్‌, చిదంబరం ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వారిపక్కనే కమల్‌ హాసన్ నిల్చొని ఉన్నారు.

‘కాఫీ విత్‌ కరణ్‌.. జాన్వీకపూర్‌ వ్యాఖ్యలు వైరల్‌..!’

దక్షిణాదిలో ఎన్నో చిత్రాల్లో మనసుని హత్తుకునే పాటలు పాడి గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు అందుకున్నారు చిన్మయి. ‘విదేశాల్లో ప్రోగ్రామ్‌ కోసం వెళ్లినప్పుడు వైరముత్తు నన్ను వేధింపులకు గురి చేశాడ’ని, ఆరోపిస్తూ మీటూ వేదికగా ఆమె షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అతడు చెప్పిన మాటలు విననందుకు తన కెరీర్‌పైనే దెబ్బ కొట్టాడని ఆరోపించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని