Punnami Naagu: చిరు కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం

ప్రతి నటుడికి తన కెరీర్‌లో గుర్తుండిపోయే, జీవితాన్ని మలుపు తిప్పే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో అగ్ర కథానాయకుడు చిరంజీవి

Published : 13 Jun 2021 15:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి నటుడికి తన కెరీర్‌లో గుర్తుండిపోయే, జీవితాన్ని మలుపు తిప్పే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్‌కు ఊతం ఇచ్చిన చిత్రం ‘పున్నమినాగు’. రాజశేఖర్‌ దర్శకత్వంలో నరసింహరాజు, చిరంజీవి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై 41 ఏళ్లు(జూన్‌ 13, 1980) పూర్తి చేసుకుంది. కన్నడలో ఘన విజయం సాధించిన ‘హున్నిమియే రాత్రియాళి’ అనే చిత్రానికి ‘పున్నమినాగు’ రీమేక్‌. రాజశేఖర్‌ టేకింగ్‌, కె.చక్రవర్తి సంగీతం, చిరంజీవి, నరసింహరాజు, రతి అగ్నిహోత్రిల నటన సినిమాను విజయ పథంలో నడిపింది.

నాగులు పాత్ర చిరంజీవికి ఓ సవాల్‌

పున్నమినాగులో చిరంజీవి పోషించిన నాగులు పాత్ర ఒకరకంగా సవాల్‌తో కూడుకున్నదనే చెప్పాలి. ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి బయటకు వచ్చిన చిరుకు చిత్ర పరిశ్రమలో పెద్దగా అనుభవం లేదు. పాము లక్షణాలున్న వ్యక్తిగా డిఫరెంట్ షేడ్స్‌ చూపించాలి. ఒక నటుడిగా తనని తాను సిద్ధం చేసుకుని నాగులు పాత్రలో ఒదిగిపోయి నటించారు. సంభాషణలు పలికే తీరు, డ్యాన్స్‌లతో యువతను విశేషంగా అలరించారు. ఇక సినిమా క్లైమాక్స్‌లో చిరంజీవి పాము లక్షణాలున్న మనిషి అని తెలిసిన తర్వాత హీరో నరసింహరాజు అతడిని పారిపోమ్మంటాడు. ఆ సమయంలో.. ‘ఎక్కడికి పోవాలి.. పోతే పుట్టలోకే పోవాలి’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని