Alia Bhatt: ‘నా భర్త కనిపించడం లేదు సర్‌’.. ఆసక్తిగా ‘డార్లింగ్స్‌’ ట్రైలర్‌

అలియా భట్‌ ప్రధాన పాత్ర పోషించిన కామెడీ డ్రామా చిత్రం ‘డార్లింగ్స్‌’ . షెఫాలీ షా, విజయ్‌వర్మ, రోషన్‌ మ్యాథ్యూ.. కీలక పాత్రల్లో నటించారు. జస్మీత్‌ కె రీన్‌ దర్శకురాలు.

Published : 25 Jul 2022 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలియా భట్‌ (Alia Bhatt) ప్రధాన పాత్ర పోషించిన కామెడీ- డ్రామా చిత్రం ‘డార్లింగ్స్‌’ (Darlings). షెఫాలీ షా, విజయ్‌వర్మ, రోషన్‌ మ్యాథ్యూ కీలక పాత్రల్లో నటించారు. జస్మీత్‌ కె రీన్‌ దర్శకురాలు. ఈ చిత్రం నేరుగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో (Netflix) ఆగస్టు 5న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. ‘నా పేరు హమ్‌జా షేక్‌. నేను బద్రునిసా (అలియా) భర్తని’ అని విజయ్‌ వర్మ చెప్పే సంభాషణతో ప్రారంభమైందీ ట్రైలర్‌. భార్యను ఎంతగానో ప్రేమించే హమ్‌జా ఆమెకు దూరంగా వెళ్లిపోవడం, భర్త కనిపించడం లేదంటూ అలియా పోలీసులకు ఫిర్యాదు చేయడం తదితర సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి (రోషన్‌) ప్రవేశించడంతో వీరి కాపురంలో కలతలు వచ్చాయని కొన్ని సన్నివేశాల్ని బట్టి తెలుస్తోంది. మరి, రోషన్‌.. అలియాకు ఎలా పరిచయం అయ్యాడు? అలియా కాపురం ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అలియా ఈ సినిమాలో డీ- గ్లామర్‌గా కనిపించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని