
David Warner: ‘పుష్ప’గా మారిన డేవిడ్ వార్నర్‌ని చూశారా?
‘‘అంతా ఓకేనా డేవిడ్ భాయ్? ’’ అంటూ విరాట్ ఫన్నీ కామెంట్
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ స్టేడియంలో బ్యాటింగ్‌కు దిగాడంటే రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్, సన్‌రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. కరోనా వేళ పాపం క్రికెట్ ఆడలేకపోయిన వార్నర్ తన భార్యతో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోలతో భలేగా ఫేమస్ అయిపోయాడు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’లో క్యాండీ వార్నర్‌తో కలిసి ‘బుట్టబొమ్మ’.. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’లో మైండ్ బ్లాక్ పాటలకు స్టెప్పులేసి తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. తర్వాత వరుసగా క్రికెట్ మ్యాచ్‌లతో డేవిడ్ వార్నర్ బిజీ అయిపోయాడు. ఇప్పుడు మళ్లీ తగ్గేదేలే అంటూ డేవిడ్ వార్నర్ తనలోని కళను బయటకు తీశాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’లోని యే బిడ్దా.. ఇది నా అడ్డా..’ పాటను ఇమిటేట్ చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికో క్యాప్షన్ పెట్టండి అంటూ వ్యాఖ్య చేశాడు. ఇక వీడియో వీక్షించిన విరాట్ కోహ్లీ .. ‘నువ్వు ఓకే నా!’ అని కామెంట్ చేయగా... ‘కాస్త గొంతు పట్టేసినట్టుంది..’ అని వార్నర్ సరదాగా సమాధానం ఇచ్చాడు. దీనిని చూసిన అల్లుఅర్జున్ ‘‘ మై బ్రదర్ వార్నర్.. తగ్గేదేలే’’ అని కామెంట్ చేశాడు.