Kajol: కాజోల్ డ్రెస్‌ ఛేంజింగ్ వీడియో అంటూ ప్రచారం.. సినీ తారల కలవరపాటు

నటి కాజోల్‌ (Kajol)కు సంబంధించిన ఓ డీప్‌ఫేక్‌ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 16 Nov 2023 14:13 IST

ముంబయి: సోషల్‌మీడియాలో సంచలనంగా మారిన నటి రష్మిక (Rashmika) డీప్‌ ఫేక్‌ వీడియో ఘటన మరవక ముందే మరో హీరోయిన్‌ను ఆకతాయిలు టార్గెట్‌ చేశారు. బాలీవుడ్‌ నటి కాజోల్‌పై డీప్‌ ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేశారు. ‘గెట్‌ రెడీ విత్‌ మీ’ అంటూ ఓ సోషల్‌మీడియా తార పోస్ట్‌ చేసిన వీడియోకు కాజోల్‌ ముఖాన్ని ఉపయోగించి ఫేక్‌ వీడియో సృష్టించారు. కాజోల్ డ్రెస్‌ ఛేంజింగ్‌ వీడియో అంటూ దీనిని నెట్టింట షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.దీనిపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఫేక్‌ వీడియోలతో సినీతారలను టార్గెట్‌ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ నెలలో టిక్‌టాక్‌ వేదికగా ఓ సోషల్‌మీడియా స్టార్‌ దీనిని పోస్ట్ చేశారని.. దానిని ఉపయోగించి కాజోల్‌ ఇమేజ్‌కు ఇబ్బంది కలిగించేలా ఈ వీడియో చేశారని పేర్కొన్నారు.

Sreeleela: ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా బ్యాకప్‌ అవసరం : శ్రీలీల

కొత్త సాంకేతికను దుర్వినియోగం చేస్తూ పలువురు ఆకతాయిలు ఇలాంటి డీప్‌ ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు. ఇటీవల సోషల్‌మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై అమితాబ్‌ బచ్చన్‌, కీర్తిసురేశ్‌, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై రష్మిక సైతం ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందన్నారు. ఆ ఘటన మర్చిపోక ముందే కాజోల్‌కు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియో తాజాగా వైరల్‌ కావడం సినీ తారలను కలవరపెడుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని