Dhanush Maaran: ధనుష్‌ ‘మారన్‌’ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందంటే..

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్‌.. ఇప్పుడు ‘మారన్‌’ చిత్రంతో అలరించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రాబోతున్న ఈ తమిళ చిత్రానికి కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 14 Feb 2022 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్‌.. ఇప్పుడు ‘మారన్‌’ చిత్రంతో అలరించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రాబోతున్న ఈ తమిళ చిత్రానికి కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక మోహనన్‌ ఇందులో కథానాయకగా నటిస్తోంది. సోమవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందో నటి మాళవిక అప్‌డేట్‌ ఇచ్చింది. ‘‘ మీ అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. త్వరలోనే డిస్నీ హాట్‌స్టార్‌లో ‘మారన్‌’ మీ ముందుకు వస్తోంది’’ అని ట్వీట్ చేసింది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. సంప్రదాయ చీర కట్టు, ఫార్మల్‌ లుక్‌లో విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని